స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్‌

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్‌


స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ హాయంలో 2016 నుంచి 2019 మధ్యకాలంలో బోగస్‌ కాంట్రాక్టుల ద్వారా రూ.118 కోట్ల ప్రజాధనం ముడుపుల రూపంలో చేతులు మారినట్లు ఇటీవల అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌ ద్వారా షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ ప్రతినిధి మనోజ్‌ వాసుదేవ్‌ సబ్‌ కాంట్రాక్టర్‌గా అవతారం ఎత్తి ఈ డబ్బులను తమ ఖాతాల్లోకి మల్లించుకున్నట్లు వార్తలు వచ్చాయి.