దేశంలో మహారాష్ట్ర తర్వాత అత్యధికంగా హెచ్ఐవీ కేసులు నమోదైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.
2023-24 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 2,22,338 హెచ్ఐవీ కేసులు ఉన్నాయి.
వీరిలో పురుషులు 99,455, మహిళలు 1,22,124, హిజ్రాలు 759 మంది ఉన్నారు.
2019-20లో ఏపీలో 1,92,093 మంది హెచ్ఐవీ బారినపడగా.. పురుషులు 80,495, మహిళలు 1,05,671, హిజ్రాలు 527 మంది ఉన్నారు.
ఉమ్మడి విశాఖ, ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో అత్యధికంగా ఈ కేసులు ఉన్నాయి.
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని ఏటా డిసెంబరు 1న నిర్వహిస్తున్నారు.
కొత్తగా నమోదవుతున్న కేసుల్లో ఎక్కువమంది బాధితుల వయసు 20-30 మధ్యన ఉంటుంది.
గర్భిణులకు హెచ్ఐవీ పరీక్షలు తప్పనిసరి చేయడం ద్వారా 2023-24లో 400 కేసులు బయటపడ్డాయి.
వ్యాధికి గురైన వారిలో రోగనిరోధకశక్తి తగ్గుతుంది. ముఖ్యంగా సీడీ4 కణాల సంఖ్య తగ్గినందున వైరస్ సోకిన వ్యక్తుల్లో ఇతర ఇన్ఫెక్షన్లు తేలిగ్గా వస్తాయి. ఫలితంగా
రోగాలబారిన పడి ప్రాణాలు కోల్పోతారు.
గర్భధారణ లేదా డెలివరీ సమయంలో తల్లిపాల ద్వారా హెచ్ఐవీ సోకే అవకాశం ఉంది.
రాష్ట్రంలో 2010-11లో కొత్త కేసులు 52,735 ఉండగా.. 2023-24లో 14,515 నమోదయ్యాయి.
గత 12 ఏళ్ల ముందు రాష్ట్రంలో 3,18,814 మంది హెచ్ఐవీ బారినపడ్డారు.
హైలీ యాక్టివ్ యాంటీ రెట్రోవైరల్ ట్రీట్మెంట్ పరీక్షలు అందుబాటులో ఉన్నందున హెచ్ఐవీ రోగ నిర్ధారణ మెరుగుపడింది.
హెచ్ఐవీ సోకినవారు యాంటీ రెట్రోవైరల్ థెరపీ చేయించుకోవడం ద్వారా వారి జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి.
గర్భందాల్చినట్లు నిర్ధారణ జరిగిన వెంటనే హెచ్ఐవీ పరీక్ష చేస్తున్నారు.
పాజిటివ్ వస్తే మళ్లీ 32-36 వారాల మధ్య వైరల్ లోడ్ టెస్టు నిర్వహిస్తున్నారు.
హెచ్ఐవీ పరీక్ష తప్పనిసరి చేసినందున తల్లులు, శిశువుల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకునేందుకు వీలు ఏర్పడింది.