తెలంగాణ GST వసూళ్లలో 3% వృద్ధి
- తెలంగాణ GST వసూళ్లలో నవంబరులో 3% వృద్ధి నమోదైంది.
- గత ఏడాది ఇదే నెలలో రూ.4,986 కోట్లు వసూలు కాగా, అది రూ.5,141 కోట్లకు పెరిగినట్లు కేంద్ర ఆర్థికశాఖ తెలి పింది.
- SGST, IGST లో SGST వాటా పంచిన తర్వాత తెలంగాణకు 2024-25 లో ఇప్పటివరకు రూ.29,186 కోట్లు వచ్చాయి. గతేడాది కంటే ఇది 9% అధికం.
- ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబరు వరకు రాష్ట్రంలో CGST, SGST, IGST, సెస్ రూపంలో మొత్తం రూ. 41,065 కోట్లు వసూలైంది.
- ఇది గత సంవత్సరం కంటే 4.9% అధికం.