Current Affairs
HIV బాధితుల్లో తెలంగాణ ఆరో స్థానం
- HIV బాధితుల్లో తెలంగాణ ఆరో స్థానంలో ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
- దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 25.44 లక్షలుగా ఉండగా, అందులో తెలంగాణాలో 1.58 లక్షల మంది ఉన్నట్లు పేర్కొంది.
- బాధితుల
సంఖ్య పరంగా తొలి అయిదు స్థానాల్లో మహారాష్ట్ర (3.90 లక్షలు),
ఆంధ్రప్రదేశ్ (3.20 లక్షలు), కర్ణాటక (2.80 లక్షలు), ఉత్తర్ ప్రదేశ్ (1.97
లక్షలు),
- తమిళనాడు (1.69 లక్షలు)లు ఉన్నాయి.
- జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ విడుదల చేసిన 'ఇండియా హెచ్ఐవీ ఎస్టిమేట్స్ 2023' నివేదిక ఈ మేరకు వెల్లడించింది.
- 'తెలంగాణలోని 1.58 లక్షల మంది బాధితుల్లో 1.54 లక్షల మంది 15 ఏళ్లు పైబడిన వారే. ఇందులో 15-24 ఏళ్ల మధ్య వయసు వారు 9,250 మంది.
- రాష్ట్రంలో యేటా 2,960 మంది HIV బారిన పడుతున్నారు.
- రాష్ట్రంలో 15-49 ఏళ్ల మధ్య వయసున్న మహిళా సెక్స్ వర్కర్లలో HIV వ్యాప్తి 0.25%, మేల్ సెక్స్ వర్కర్లలో వ్యాప్తి 0.00005% మేర ఉంది.
- మత్తుమందులు సూదుల రూపంలో తీసుకునే వారిలో వ్యాప్తి 0.35% ఈ విషయంలో తెలంగాణ దేశంలోనే చివరి స్థానంలో ఉంది.
- 2010-2023 మధ్యకాలంలో ఏటా HIV వైరస్ సోకే వారి సంఖ్య అంతకుముందుతో పోలిస్తే 58% మేర తగ్గింది.
- ఇది జాతీయ సగటు 44.2% కంటే ఎక్కువే ఈ విషయంలో తెలంగాణ జాతీయ స్థాయిలో 11వ స్థానంలో నిలిచింది.
- రాష్ట్రంలో 2023లో ఎయిడ్స్ 2,820 మంది చనిపోయారు.
- రాష్ట్రంలో ప్రతి లక్ష మందిలో 7.44 మంది ఎయిడ్స్ సంబంధ సమస్యతో మరణిస్తున్నారు.
- 2010-2023 మధ్య కాలంలో ఈ తరహా వార్షిక మరణాల్లో 81.7% తగ్గుదల నమోదైంది.
- రాష్ట్రంలో
హైదరాబాద్, కామారెడ్డి, కరీంనగర్, మహబూబ్ నగర్, మేడ్చల్-మల్కాజిగిరి,
నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్,
- హనుమకొండ, ఖమ్మం జిల్లాల్లో HIV వ్యాప్తి అధికంగా ఉంది.
- ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, ములుగు, నిర్మల్, వనపర్తి జిల్లాల్లో తక్కువగా ఉంది.
- 2023లో అత్యధికంగా హెచ్ఐవీ సోకిన వారి సంఖ్యలో రంగారెడ్డి (421) జిల్లా ప్రథమ స్థానంలో ఉంది' అని నివేదిక విశ్లేషించింది.