భారత్‌ నుంచి తొలి దేశీయ యాంటీబయాటిక్‌

భారత్‌ నుంచి తొలి దేశీయ యాంటీబయాటిక్‌
  • ఔషధాలకు లొంగని వ్యాధికారకాల పని పట్టించే యాంటీబయాటిక్‌ ‘నఫిత్రోమైసిన్‌'ను భారత్‌ తయారుచేసింది.
  • కేంద్ర ప్రభుత్వ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీలో భాగమైన బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రిసెర్చ్‌ అసిస్టెన్స్‌ కౌన్సిల్‌(బీఐఆర్‌ఏసీ) ఈ ఔషధాన్ని అభివృద్ధి చేసింది.
  • భారత్‌లో దేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి యాంటీబయాటిక్‌ ఇది.
  • ఔషధాలకు లొంగని కమ్యూనిటీ – అక్వైర్డ్‌ బ్యాక్టీరియల్‌ నిమోనియా(సీఏబీపీ) చికిత్స కోసం పెద్దలకు ఈ ఔషధాన్ని వినియోగిస్తారు.
  • ఇప్పుడు నిమోనియా చికిత్సకు ఎక్కువగా అజిత్రోమైసిన్‌ వాడుతున్నారు.
  • వ్యాధికారకాలు ఔషధ నిరోధక శక్తిని పెంచుకుంటుండటంతో చాలామంది రోగుల్లో అజిత్రోమైసిన్‌ సరిగ్గా పని చేయడం లేదు.
  • దీనికి ప్రత్యామ్నాయంగా నిమోనియా చికిత్సకు నఫిత్రోమైసిన్‌ సమర్థంగా పని చేస్తున్నది.
  • రూ.500 కోట్ల పెట్టుబడితో 14 ఏండ్ల పరిశోధన ద్వారా ఈ ఔషధాన్ని తయారుచేశారు.
  • త్వరలో ‘మిక్నాఫ్‌’ పేరుతో ముంబైకు చెందిన ఫార్మా కంపెనీ వొల్కార్డ్‌ ఈ ఔషధాన్ని మార్కెట్‌లోకి తీసుకురానున్నది.