తెలంగాణలోని చేనేత కార్మికులు తయారు చేసిన చీరలు, పంచెలు, లుంగీలు, కండువాలు, దుప్పట్లు, తువాళ్లు, బెడ్ షీట్లు తదితర వస్త్రాలకు హ్యాండ్లూమ్ మార్క్ లు కనిపిస్తాయి. దీని స్వచ్ఛమైన చేనేతకు అది ముద్రగా ఉపయోగపడడంతోపాటు దాని ద్వారా వస్త్రం రకం, దానిని తయారు చేసిన కార్మికుని సమాచారం తెలుసుకోవచ్చు.
వస్త్రంతోపాటు కార్మికునికి సంబంధించిన పూర్తి సమాచారం అందులో పొందుపరచనుంది.
చేనేత అభయహస్తం కింద హ్యాండ్లూమ్ మార్క్ ట్యాగ్ లను రాష్ట్ర ప్రభుత్వమే పంపిణీ చేయడంతో పాటు వీటిని వాడినందుకు ఆర్థికసాయం సైతం అందించనుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 59,425 మంది చేనేత కార్మికులున్నారు. 290 చేనేత సహకార సంఘాల కింద అధికశాతం పనిచేస్తున్నారు.
ప్రస్తుతం వారు ఉత్పత్తి చేస్తున్న వస్త్రాలను రాష్ట్ర చేనేత సహకార సంఘం(టెస్కో)కి విక్రయిస్తున్నారు.
చేనేత రిజర్వేషన్ పరిరక్షణ చట్టం పరిధిలో 11 వస్త్రాలు ఉన్నాయి. వాటిని కార్మికులే తయారు చేయాల్సి ఉన్నా పవర్ లూమ్ సంస్థలు సైతం తయారు చేస్తున్నాయి.