సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మన్మోహన్ నియామకం

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మన్మోహన్ నియామకం

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మన్మో హన్ నియమితులయ్యారు.
ప్రస్తుతం దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న ఆయన్ని సుప్రీంకోర్టు జడ్జిగా నియమించాలని ఇటీవల కొలిజియం చేసిన సిఫార్సు మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి ఆయన నియామకం అమల్లోకి వస్తుంది. ఆయనతో కలిపి సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 33కి చేరుతుంది. మంజూరైన సంఖ్య ప్రకారం మరొక్క న్యాయ మూర్తిని నియమించాల్సి ఉంది.