ఎస్పీ శైలజకు ఘంటసాల పురస్కారం

ఎస్పీ శైలజకు ఘంటసాల పురస్కారం

హైద రాబాద్ లోని రవీంద్రభారతిలో శ్రుతిలయ ఫౌండేషన్, సీల్వెల్ కార్పొరే షన్, ఆదర్శ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో ఘంటసాల వెంకటేశ్వరరావు 102వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గాయని ఎస్పీ శైలజకు ఘంటసాల జీవన సాఫల్య పురస్కారం, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు ఘంటసాల సినీ గేయ పురస్కారం, శంభు ప్రసాద్ కు ఘంటసాల యువ సంగీత దర్శక పురస్కారం, బి. సత్య జగదీశ్ కు ఘంటసాల నాటక రచన పురస్కారం, సందీప్ కు ఘంటసాల యువ గాయక పురస్కారాలు అందజేసి సత్కరించారు.