CBI మాజీ డైరెక్టర్ విజయ్ శంకర్ కన్నుమూత

CBI మాజీ డైరెక్టర్ విజయ్ శంకర్ కన్నుమూత

CBI మాజీ డైరెక్టర్ విజయ్ శంకర్ (76) నొయిడాలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.
ఉత్తరప్రదేశ్ క్యాడర్ కు చెందిన 1969 బ్యాచ్ ఐపీఎస్ అధికారి విజయ్ శంకర్ 2005 డిసెంబరు 12 నుంచి 2008 జులై 31 వరకూ సీబీఐ డైరెక్టర్ గా పనిచేశారు.
ఆయన హయాంలో సీబీఐ దేశంలోనే సంచలనం సృష్టించిన ఆరుషి హేమ్ రాజ్ జంటహత్యల కేసుపై విచారణ చేపట్టింది.
గతంలో గ్యాంగ్ స్టర్ అబూసలేం, నటి మెనికా బేడీలను పోర్చుగల్ నుంచి భారత్ కు తరలించడాన్ని సీబీఐ అదనపు డైరెక్టర్ గా ఆయన పర్యవేక్షించారు.