అమెరికా నుంచి భారత్ కు హెలికాప్టర్ విడిభాగాలు
భారత్- అమెరికా సంబంధాల బలోపేతా నికి దారితీసే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎంహెచ్-60ఆర్ మల్టీ మిషన్ హెలి కాప్టర్ల విడిభాగాలను, ఇతర అనుబంధ సామగ్రిని భారత్ కు విక్రయించడానికి అమెరికా ప్రభుత్వం సమ్మతి తెలిపింది.
ఫలితంగా అమెరికా 117 బిలియన్ డాలర్ల (రూ.9,900 కోట్లు) విలువైన హెలికాప్టర్ విడిభాగాలను భారత్ కు విక్రయించనుంది.
ఈ పరికరాలు భారత బలగాల శత్రు జలాంతర్గామి విధ్వంసక సామర్థ్యాన్ని పెంపొందించేందుకు, రక్షణ సంబంధమైన ముప్పును తిప్పికొట్టేందుకు ఉపయోగపడగలవని డిఫెన్స్ సెక్యూ రిటీ కోఆపరేన్ ఏజెన్సీ అమెరికా పార్లమెంటుకు తెలియ జేసింది.
అధ్యక్షుడు జైడెన్ నాలుగేళ్ల పదవీకాలం మరి కొన్ని వారాల్లో పూర్తికానుండగా చోటుచేసుకున్న ఈ పరిణామం ప్రాదాన్యం సంతరించుకుంది.
లాకోడ్ మార్టిన్ రోటరీ అండ్ మిషన్ సంస్థ ఈ పరికరాలను భారత్ కు అందించే ప్రధాన కాంట్రాక్టర్ గా వ్యవహరించనుంది.