మహారాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్

మహారాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్
  • మహారాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్ (54) 2024, డిసెంబరు 5న ప్రమాణస్వీకారం చేశారు.
  • దక్షిణ ముంబయిలోని ఆజాద్ మైదాన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఫడణవీస్ తో ప్రమాణం చేయించారు.
  • శివసేన అధినేత ఏకానాధ్ శిందే, ఎన్సీపీ అగ్రనేత అజిత్ పవార్లకు ఉప ముఖ్యమంత్రుల హోదా కల్పించారు.
  • ఫడణ వీస్ మహారాష్ట్ర సీఎంగా ప్రమాణం చేయడం ఇది మూడోసారి కాగా, అజిత్ పవార్ కు ఆరోసారి డిప్యూటీ సీఎం హోదా దక్కింది.