చిలీ మాజీ అధ్యక్షురాలికి ఇందిరా గాంధీ శాంతి పురస్కారం

చిలీ మాజీ అధ్యక్షురాలికి ఇందిరా గాంధీ శాంతి పురస్కారం

చిలీ మాజీ అధ్యక్షురాలు, మానవ హక్కుల కోసం పోరాటం చేసిన ప్రముఖురాలు మిచెల్ బచులెట్ ఈ ఏడాది ఇందిరా గాంధీ శాంతి పురస్కారానికి ఎంపికయ్యారు.
జాతీయ భద్రతా మాజీ సలహాదారు శివశంకర్ మీనన్ అధ్యక్షతన ఏర్పాటైన అంతర్జాతీయ జ్యూరీ ఎంపిక చేసినట్లు ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ ఓ ప్రకటన విడుదల చేసింది.
'మానవ హక్కులు, శాంతి, సమానత్వానికై పోరాడిన ప్రపంచ ప్రముఖుల్లో ఒకరైన మిచెల్ బచులెట్ ఇందిరా గాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభి వృద్ధి-2024 పురస్కారానికి ఎన్నికయ్యారు.
ఐక్య రాజ్య సమితిలో మహిళా విభాగ వ్యవస్థాపక డైరెక్టర్ గా, మానవ హక్కుల విభాగానికి హై కమిషనర్, చిలీ అధ్యక్షురాలిగా లింగ సమానత్వం కోసం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత బలహీనవర్గాల కోసం తన గొంతును బలంగా వినిపించారు.