డీఎస్ చౌహాన్ కు కేంద్ర పురస్కారం

డీఎస్ చౌహాన్ కు కేంద్ర పురస్కారం

తెలంగాణ పౌరసరఫరాల శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్ డీఎస్ చౌహాన్ కేంద్ర వినియోగదారుల వ్యవహా రాలు, ప్రజాపంపిణీ శాఖ నుంచి ప్రశంసా పురస్కారాన్ని అందు కున్నారు. ఆహార దాన్యాల రవాణాలో, ప్రజాపంపిణీ వ్యవస్థలో జాతీయ స్థాయి ప్రమాణాల్ని నెలకొల్పినందుకు ఆయనకు ఈ పురస్కారం లభిం చిందని పౌరసరఫరాల శాఖ తెలిపింది. దిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చేతుల మీదుగా ఆయన ఈ పురస్కా రాన్ని అందుకున్నారు.