ప్రతి సంవత్సరం డిసెంబరు 21న 'ప్రపంచ ద్యాన దినోత్సవాన్ని' నిర్వహించాలంటూ ప్రవేశపెట్టిన తీర్మానానికి నానికి ఐరాస ఏకగ్రీవంగా ఆమోదం తెలి పింది. ఈ విషయాన్ని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ వెల్ల డించారు.
"సమగ్ర శ్రేయస్సు, అంతర్గత పరివర్తన కోసం ఒక రోజు..! ఏటా డిసెంబరు 21న ప్రపంచ ద్యాన దినోత్సవాన్ని నిర్వహించుకునేందుకు భారత్ సహా ఇతర దేశాలు తీసుకొచ్చిన తీర్మానాన్ని ఐరాస ఆమోదించింది.
'వసుదైక కుటుంబకం' అనే సూత్రాన్ని బలంగా విశ్వసించే భారత్.. ప్రపంచ శ్రేయస్సు కోసం పాటుపడు తోంది.
193 మంది సభ్యులున్న ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశమై దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది" అని తెలిపారు.