దియాకి డయానా అవార్డు

దియాకి డయానా అవార్డు
  • దేశవ్యాప్తంగా నగరాల్లో ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పెరుగుతున్నాయి. వాటిలో రీసైక్లింగ్ కి వెళ్తున్నవి మాత్రం చాలా తక్కువ. ఇదీ పర్యావరణానికి చేటే దీనిపై అవగాహన కల్పిస్తోంది దియా లోకా. ఆ సేవలకు గుర్తుగా డయానా అవార్డుకు ఎంపికైంది.
  • దియాలోకా చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్లస్ 2 చదువుతోంది. ఈమెది హైదరాబాద్. 2021లో (14 ఏళ్ల వయసులో) ఎలక్ట్రానిక్ వ్యర్థాల (ఇ-వ్యర్థాలు) కట్టడి కోసం 'ఇ-సైకిల్' సంస్థను స్థాపించింది. దీని ద్వారా ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ, రీసైక్లింగ్ కు పంపడమే కాదు... దేశంలోని అనేక పాఠశాలలు, కాలనీల్లో అవగాహన కార్యక్రమాలను చేపడుతోంది. తన ప్రాజెక్టు గురించి అంతర్జాతీయ సదస్సుల్లోనూ వివరించింది. ఇప్పటివరకు 10వేల కేజీల ఇ-వ్యర్థాలను సేకరించింది. విద్యార్థులు సహా దాదాపు 9 వేలమందికి వీటిపై అవగాహనా కల్పించింది. తన కృషికి గుర్తింపుగా 'డయానా అవార్డు'కు ఎంపికైంది.