కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం కృష్ణ ఊపిరితిత్తుల్లో తీవ్ర ఇన్ఫెక్షన్ కారణంగా కన్నుమూశారు.
ఎస్ఎం కృష్ణ పూర్తి పేరు సోమనహళ్లి మల్లయ్య కృష్ణ 1932 మే 1న సోమనహళ్లిలో జన్మించారు.
న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తిచేశాక ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అదే సమయంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు చూసి రాజకీయాల పట్ల ఆకర్షితుడయ్యారు. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జాన్ ఎఫ్. కెనడీకి ప్రవాస భారతీయుల తరపున ప్రచారం చేశారు.
అమెరికా నుంచి తిరిగొచ్చాక కర్ణాటకలోని న్యాయకళాశా లలో ఆచార్యులుగా పనిచేసిన కృష్ణ.. రాజకీయా ల్లోకి వచ్చి 30 ఏళ్లకే స్వతంత్ర అభ్యర్ధిగా విధాన సభలో అడుగుపెట్టారు.
35 ఏళ్ల వయస్సులో ప్రజా సోషలిస్ట్ పార్టీ తరపున లోక్సభకు ఎన్నిక య్యారు.
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సూచనతో 1971లో కాంగ్రెస్ లో చేరి, 2017 వరకు అదే పార్టీలో కొనసాగారు.
విధాన సభ, విధాన పరిషత్తుల్లో సభ్యుడిగా, స్పీకర్ గా, ఉప ముఖ్యమంత్రిగా సేవలందించారు. 2004లో మహారాష్ట్ర గవర్నర్, 2009 నుంచి 2012 వరకు కేంద్ర విదేశాంగ మంత్రిగానూ రాణించారు. 2017లో కాంగ్రెస్ ను వీడి భాజపాలో చేరారు.