అత్యంత వేడి సంవత్సరం కానున్న 2024
అత్యంత వేడి సంవత్సరంగా 2024 నమోదు కానుందని ఐరోపా వాతావరణ సంస్థ కోపర్నికస్ సోమవారం తెలిపింది. అలాగే సగటు ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదు కావడం కూడా ఇదే తొలి సారి అని వెల్లడించింది. 2024 నవంబరు (2023 నవంబరు తర్వాత) కూడా రెండో అత్యంత వేడి నెలగా నిలిచిందని పేర్కొంది. ఈ నెలలో ఉపతల గాలి సగటు ఉష్ణోగ్రత 14. 10 డిగ్రీల సెల్సియస్ గా ఉందని, అది 1991-2020 సగటు కన్నా 0.73 డిగ్రీల సెల్సియస్ అధికమని చెప్పింది. అలాగే గ్లోబల్ వార్మింగ్ లో కూడా 2024 నవంబరు రికార్డు సృష్టించిందని, ఈ నెలలో పారిశ్రామికీకరణ ముందు స్థాయి కంటే 1.62 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదయిందని వివరిం చింది. భారత వాతావరణ విభాగం ప్రకారం..భారత్ లో 1901 నుంచి చూస్తే చరిత్రలో నవంబరు వేడిగా ఉండడం ఇది రెండో సారి. ఇక్కడ సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత 29.37 డిగ్రీల సెల్సి యస్ గా నమోదయింది. ఇది సాధారణం కన్నా 0.62 డిగ్రీల సెల్సియస్ అధికం..