రాష్ట్రానికి నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు

రాష్ట్రానికి నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతిష్ఠాత్మక నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు-2024 దక్కింది.
  • భవనాలు, పరిశ్రమలు, మున్సిపాలిటీలు, వ్యవసాయం, రవాణా రంగాల్లో ఇంధన పొదుపు, సామర్థ్య చర్యలను ప్రోత్సహించి, అమలు చేసినందుకు ఈ అవార్డు లభించింది.
  • కేంద్ర విద్యుత్ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (BEE) రాష్ట్రాలను విద్యుత్ వినియోగం ఆధారంగా నాలుగు గ్రూపులుగా విభజించగా, అందులో ఏపీ గ్రూప్-2లో ఉంది. అందులో ఉత్తమ ప్రదర్శన కనబరిచి. స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ (SEI) -2024లో 87.25 పాయింట్లు సాదించింది.
  • జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర పునరుత్పాదక ఇందన శాఖ మంత్రి శ్రీపాదా నాయక్ చేతుల మీదుగా అవార్డును రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇంధన శాఖ సంయుక్త కార్యదర్శి కుమారరెడ్డి అందుకున్నారు.