ఫిబ్రవరి లో GST వసూళ్లు

ఫిబ్రవరి లో GST వసూళ్లు
  • దేశంలో వస్తు, సేవల పన్ను వసూళ్లు (GST collections) మరోసారి భారీ స్థాయిలో నమోదయ్యాయి.
  • ఫిబ్రవరి నెలకు గానూ రూ.1.84 లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
  • గతేడాది ఇదే నెలతో పోలిస్తే వసూళ్లలో 9.1 శాతం వృద్ధి నమోదైంది.
  • GST ఆదాయంలో దేశీయ రెవెన్యూ వసూళ్లు 10.2 శాతం మేర పెరిగి రూ.1.42 లక్షల కోట్లకు చేరగా.. దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయంలో 5.4 శాతం వృద్ధితో రూ.41,702 కోట్లుగా నమోదైంది.
  • ఫిబ్రవరి నెలకు వసూలైన మొత్తం వసూళ్లలో సెంట్రల్ GST  నుంచి రూ.35,204 కోట్లు, స్టేట్ GST  నుంచి రూ.43,704 కోట్లు, ఇంటిగ్రేటెడ్ GST  నుంచి రూ.90,870 కోట్లు వసూలైనట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి.
  • సెస్సుల రూపంలో రూ.13,868 కోట్లు సమకూరినట్లు కేంద్రం తెలిపింది.
  • ఈ ఏడాది జనవరిలో అత్యధికంగా రూ.1.96 లక్షల కోట్లు వసూళ్లు నమోదైన సంగతి తెలిసిందే