ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ ‘ఐకాన్ ఆఫ్ ది సీస్’

ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ ‘ఐకాన్ ఆఫ్ ది సీస్’

ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ ‘ఐకాన్ ఆఫ్ ది సీస్’ తాజాగా సముద్ర ట్రయల్ రన్ ప్రారంభం అయింది. టైటానిక్ కంటే ఐదు రెట్లు పెద్దదైన ఈ నౌక. జూన్ నెలలో మొదటి విడత ట్రయల్ రన్‌ను ఈ విలాసవంతమైన నౌక పూర్తి చేసుకుంది.

ఫిన్‌లాండ్‌లోని టర్కులోని నౌకానిర్మాణ సంస్థల్లో ఒకటైన మేయర్ టర్కు షిప్‌యార్డ్‌లో నిర్మించారు. రాయల్ కరీబియన్ ఇంటర్నేషనల్ సంస్థ (Royal Caribbean International) ఐకాన్ ఆఫ్ ది సీస్ భారీ క్రూయిజ్ షిప్ ను నిర్మించింది. 2024వ సంవత్సరంలో జనవరి నెలలో పర్యాటకులకు అందుబాటులోకి రానున్న ఈ భారీ నౌక ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ అవుతుందని భావిస్తున్నారు.

ఈ ఓడలో అత్యంత అధునాతన 28 రకాల వసతి సౌకర్యాలతో పర్యాటకులకు వినూత్న అనుభూతి ఇవ్వనుంది. నౌకలోని రాయల్ లాఫ్ట్ సూట్ లో రెండు బెడ్రూంలు, డైనింగ్ ఏరియా, హాట్ టబ్, టెర్రస్, బేబీ గ్రాండ్ పియానోతో కూడిన లివింగ్ రూంలున్నాయి. ఓడలో అవుట్ డోర్ రిలాక్సేషన్ జోన్ రాయల్ కరేబియన్ క్రూయిజ్ లైనర్ లున్నాయి. నౌకలో ఉన్న సన్‌సెట్ కార్నర్ సూట్ అద్భుతమైన సముద్ర వీక్షణ అనుభూతిని పర్యాటకులకు అందించనుంది.

ఐకాన్ ఆఫ్ ది సీస్ 5,610 మంది ప్రయాణికులు, 2,350 మంది సిబ్బందిని తీసుకెళ్లేలా రూపొందించారు. ఈ నౌకలో ఉద్యానవనాలు, పార్కులు కూడా ఏర్పాటు చేశారు. రాయల్ కరేబియన్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించిన ఐకాన్ ఆఫ్ ది సీస్ నౌక 365 మీటర్ల పొడవు, 2,50,800 టన్నుల బరువు ఉంటుంది. ఈ నౌకలో 7 ఈత కొలనులు, 9 వర్ల్ పూల్స్ నిర్మించారు. ఐకాన్ ఆఫ్ ది సీస్‌లో పర్యాటకులు సముద్ర అందాలను తిలకించడానికి వీలుగా 20 డెక్‌లు,8 ప్రాంతాలు ఉన్నాయి.

అతి పెద్ద ఓడ సముద్ర ట్రయల్ జూన్ 22వతేదీన పూర్తి అయింది. ‘‘ఐకాన్ ఆఫ్ ది సీస్ నౌక మొదటి సముద్ర ట్రయల్స్ సమయంలో వందల మైళ్లు ప్రయాణించింది. లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్, ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో నడిచే రాయల్ కరేబియన్ ఇంటర్నేషనల్ యొక్క మొదటి నౌక. కరేబియన్ దీవులైన బహమాస్, కొజుమెల్, ఫిలిప్స్ బర్గ్, సెయింట్ మార్టెన్,రోబన్, హోండురస్ మీదుగా ఈ నౌక ప్రయాణించనుంది.