విశ్వనాథ్ గెల్లాకు స్ఫూర్తిదాయక పల్మనాలజిస్ట్ పురస్కారం
ఏఐజీ (గచ్చిబౌలి) హాస్పిటల్స్‌కు చెందిన సీనియర్ శ్వాసకోశ నిపుణులు డాక్టర్ విశ్వనాథ్ గెల్లాను స్ఫూర్తిదాయక పల్మనాలజిస్ట్ పురస్కారం వరించింది. వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాజీ క్రికెటర్ జవగల్ శ్రీనాథ్ చేతులమీదుగా ‘భారత్ స్ఫూర్తిదాయక పల్మనాలజిస్ట్’ పురస్కారాన్ని డాక్టర్ విశ్వనాథ్ అందుకున్నారు. ఇది ఏఐజీ హాస్పిటల్స్ పల్మనాలజీ బృందానికి దక్కిన అరుదైన గౌరవం అని డాక్టర్ విశ్వనాథ్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.