రామోజీ ఫిల్మ్‌సిటీ'కి ఎఫ్‌టీసీసీఐ ఎక్స్‌లెన్స్‌ టూరిజం అవార్డు

రామోజీ ఫిల్మ్‌సిటీ'కి ఎఫ్‌టీసీసీఐ ఎక్స్‌లెన్స్‌ టూరిజం అవార్డు

పర్యాటక స్వర్గధామం రామోజీ ఫిల్మ్‌ సిటీకి... మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. పర్యాటకరంగంలో రామోజీ ఫిల్మ్ సిటీ చేస్తున్న విశేష కృషికిగానూ... ఎఫ్​టీసీసీఐ ఎక్స్‌లెన్స్ టూరిజం అవార్డు ప్రదానం చేసింది. హైదరాబాద్‌ హెచ్​ఐసీసీలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో.... తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా.. ఫిల్మ్‌సిటీ ఎండీ సీ.హెచ్‌.విజయేశ్వరి అవార్డు అందుకున్నారు.  ఎక్స్‌లెన్స్‌ టూరిజం అవార్డు కోసం... ఎఫ్​టీసీసీఐకి 22 రంగాలలో 150 దరఖాస్తులు రాగా... అందులో రామోజీ ఫిల్మ్‌సిటీకి అవార్డు లభించింది.