ఆసియా క్రీడలకు షూటర్‌ ఇషా సింగ్‌

ఆసియా క్రీడలకు షూటర్‌ ఇషా సింగ్‌

తెలంగాణ స్టార్‌ షూటర్‌ ఇషా సింగ్‌ ఈ ఏడాది జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌, ఆసియా క్రీడలకు ఎంపికైంది. తెలంగాణ స్టార్‌ షూటర్‌ ఇషా సింగ్‌ ఈ ఏడాది జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌, ఆసియా క్రీడలకు ఎంపికైంది. ఆగస్టు 14 నుంచి అజర్‌బైజాన్‌లో జరిగే ప్రపంచ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌, సెప్టెంబర్‌ 23న చైనాలో ఆరంభమయ్యే ఆసియా క్రీడల్లో పోటీపడే భారత షూటర్ల బృందాన్ని జాతీయ రైఫిల్‌ సంఘం ప్రకటించింది. ఈ రెండు పోటీల్లోనూ ఇషా.. మహిళల వ్యక్తిగత 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌, 25 మీటర్ల స్పోర్ట్స్‌ పిస్టల్‌తో పాటు మిక్స్‌డ్‌ టీమ్‌లో తలపడనుంది. మిక్స్‌డ్‌ టీమ్‌ కోసం ఆమె శివ నర్వాల్‌తో జత కట్టనుంది. మరో భారత స్టార్‌ షూటర్‌ మను బాకర్‌.. మహిళల 25మీ. స్పోర్ట్స్‌ పిస్టల్‌ విభాగంలో బరిలో దిగుతుంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌కు 22 మంది, ఆసియా క్రీడలకు 21 మంది షూటర్లతో కూడిన భారత బృందాలు వెళ్లనున్నాయి.