ఆక్వాటిక్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్‌ వ్రితి అగర్వాల్‌

ఆక్వాటిక్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్‌ వ్రితి అగర్వాల్‌

జాతీయ సీనియర్‌ ఆక్వాటిక్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్‌ వ్రితి అగర్వాల్‌ కాంస్యంతో మెరిసింది. జాతీయ సీనియర్‌ ఆక్వాటిక్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్‌ వ్రితి అగర్వాల్‌ కాంస్యంతో మెరిసింది. ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన మహిళల 400 మీటర్ల ఫ్రీస్టైల్‌లో ఆమె మూడో స్థానాన్ని దక్కించుకుంది. 4 నిమిషాల 33.33 సెకన్లలో ఆమె గమ్యాన్ని చేరుకుంది. భవ్య (దిల్లీ- 4:28.65ని), ఆన్య (మహారాష్ట్ర- 4:30.14ని) వరుసగా స్వర్ణ, రజత పతకాలు కైవసం చేసుకున్నారు. ఈ స్విమ్మింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణకు వచ్చిన తొలి పతకం ఇదే.