విజ‌య‌వంతంగా క‌క్ష్య‌లోకి ఆదిత్య ఎల్‌1

విజ‌య‌వంతంగా క‌క్ష్య‌లోకి ఆదిత్య ఎల్‌1

ఇస్రో ప్ర‌యోగించిన ఆదిత్య ఎల్‌1.. నిర్దేశిత క‌క్ష్య‌లోకి వెళ్లింది. పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ఆ శాటిలైట్‌ను మోసుకెళ్లింది. 15 ల‌క్ష‌ల కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఎల్‌1 పాయింట్ దిశ‌గా ఆదిత్య స్పేస్‌క్రాఫ్ట్ త‌న జ‌ర్నీ మొద‌లుపెట్టిన‌ట్లు ఇస్రో చీఫ్ సోమ‌నాథ్ తెలిపారు.  125 రోజుల త‌ర్వాత ఆదిత్య స్పేస్‌క్రాఫ్ట్ .. ఎల్‌1 పాయింట్‌కు చేరుకోనున్న‌ది.
సుమారు 1.04 నిమిషాల త‌ర్వాత రాకెట్ నుంచి వేరుప‌డిన ఆదిత్య ఎల్‌1 క‌క్ష్య‌లోకి చేరింది.