రిషీ సునాక్‌ కేబినెట్‌లో మరో భారత సంతతి మహిళ

రిషీ సునాక్‌ కేబినెట్‌లో మరో భారత సంతతి మహిళ

రిషీ సునాక్‌  నేతృత్వంలోని బ్రిటన్‌ కేబినెట్‌లో మరో భారత సంతతి మహిళ చేరారు. గోవా మూలాలున్న 38 ఏళ్ల క్లెయిర్‌ కౌటినో ను ఇంధనశాఖ మంత్రిగా ప్రధాని రిషి సునాక్‌ నియమించారు. ప్రస్తుతం ఇంధనశాఖ మంత్రిగా ఉన్న గ్రాంట్‌ షాప్స్‌ రక్షణ మంత్రిగా పదోన్నతి పొందారు.
బ్రిటన్‌లో జన్మించిన కౌటినో ఆక్స్‌ఫర్డ్‌లో గణితం, ఫిలాసఫీలో మాస్టర్స్‌ చేశారు. ఈస్ట్‌ సర్రే నుంచి పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు సునాక్‌ కేబినెట్‌లో పిన్న వయస్కురాలైన మంత్రిగా నియమితురాలయ్యారు. గతంలో బ్రిటన్‌ ట్రెజరీ విభాగానికి ప్రత్యేక సలహాదారుగా, సునాక్‌ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు సహాయకురాలిగా, ఖజానాకు ఛాన్సెలర్‌గా కౌటినో పని చేశారు.