ఈజిప్ట్ బిలియనీర్ మొహమ్మద్ అల్ ఫయెద్ కన్నుమూత

ఈజిప్ట్ బిలియనీర్ మొహమ్మద్ అల్ ఫయెద్ కన్నుమూత

ఈజిప్ట్‌కు చెందిన బిలియనీర్ మొహమ్మద్ అల్-ఫయద్ కన్నుమూశారు. 94 ఏండ్ల అల్‌ ఫయెద్‌ వయస్సురీత్యా అనారోగ్య కారణాలతో తుదిశ్వాస విడిచారు. ఈజిప్టులోని అలెగ్జాండ్రియాలో జన్మించిన అల్ ఫయెద్ మొదట ఫిజీ డ్రింక్స్ అమ్మకాలతో వ్యాపారరంగంలో అడుగుపెట్టారు. అనంతరం కుట్టుమిషన్ల సేల్స్‌మెన్‌గా పనిచేశారు. ఆ తర్వాత రియల్ఎస్టేట్, షిప్పింగ్, నిర్మాణ రంగాల్లో దూసుకెళ్లారు. హరాడ్‌ డిపార్ట్‌మెంట్‌ స్టోర్స్‌ , ఫుల్ హామ్, పారిస్‌లో రిట్జ్ హోటల్‌ను స్థాపించారు. వ్యాపార రంగంలో చేసిన సేవలకుగాను ఫ్రాన్స్‌  అత్యున్నత పౌరపురస్కారం ‘లెజియన్ ఆఫ్ హానర్’తో సత్కరించింది.