భార‌త స్టార్ స్ప్రింట‌ర్‌ హిమా దాస్‌ పై రెండేళ్ల నిషేధం

భార‌త స్టార్ స్ప్రింట‌ర్‌ హిమా దాస్‌ పై రెండేళ్ల నిషేధం

భార‌త స్టార్ స్ప్రింట‌ర్ హిమా దాస్‌ కు జాతీయ డ్ర‌గ్స్ నిరోధ‌క సంస్థ షాకిచ్చింది. డోప్ ప‌రీక్ష‌లో విఫ‌ల‌మైన ఆమెను స‌స్పెండ్ చేసింది. ఏడాది కాలంలో హిమ మూడు సార్లు డోప్ ప‌రీక్ష‌లో దొరికిపోయింది.
జక‌ర్తాలో వెండి ప‌త‌కం
ఆసియా గేమ్స్‌లో హిమ దాస్‌కు గొప్ప రికార్డు ఉంది. 2018లో జక‌ర్తాలో జ‌రిగిన ఆసియా గేమ్స్‌లో హిమ 400 మీట‌ర్ల ప‌రుగు పందెంలో వెండి ప‌త‌కంతో మెరిసింది. అంతేకాదు  4x400m మీట‌ర్ల మ‌హిళ‌ల రీలేలో బంగారు ప‌త‌కం, మిక్స్‌డ్ 4x400m మీట‌ర్ల రేలేలో సిల్వ‌ర్ మెడ‌ల్ గెలిచిన భార‌త జ‌ట్టులో హిమ స‌భ్యురాలు.