మెరైన్‌ రోబో.. అభివృద్ధి చేసిన ఐఐటీ పాలక్కడ్‌ పరిశోధకులు

మెరైన్‌ రోబో.. అభివృద్ధి చేసిన ఐఐటీ పాలక్కడ్‌ పరిశోధకులు

నీటి లోపల నిఘా కోసం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మండి, ఐఐటీ పాలక్కడ్‌కు చెందిన పరిశోధకులు అధునాతన మెరైన్‌ రోబోను అభివృద్ధి చేశారు. ఈ ప్రాజెక్టుకు DRDO యొక్క నావల్ రీసెర్చ్ బోర్డ్ పాక్షికంగా నిధులు సమకూర్చింది. సముద్ర జలాలు, ఇతర నీటి వనరుల్లో అట్టడుగుకు సైతం చేరుకొని పని చేసేలా ఈ రోబోను రూపొందించారు. ప్రస్తుతం సముద్రంలో నీటి లోపల నిఘా, అధ్యయనం కోసం పరిశోధన నౌకలను వినియోగించాల్సి వస్తున్నది.