అగ్రరాజ్యం అమెరికాలో మరో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి లభించింది.
అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ భారత సంతతికి చెందిన కశ్యప్ కాష్ పటేల్‌ను దర్యాప్తు సంస్థ ‘ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ (FBI) తదుపరి డైరెక్టర్‌గా నియమించారు.
న్యాయవాదిగా సుదీర్ఘ అనుభవం కలిగిన కాష్ పటేల్ పనితీరును ట్రంప్ ప్రశంసించారు.
అంతకు ముందు, కాష్ పటేల్ రక్షణ మంత్రిత్వ శాఖలో చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా, నేషనల్ ఇంటెలిజెన్స్‌లో డిప్యూటీ డైరెక్టర్‌గా, ట్రంప్ మొదటి టర్మ్‌లో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్లో యాంటీ టెర్రరిజం ప్రోగ్రామ్‌ల సీనియర్ డైరెక్టర్‌గా పనిచేశారు.
భారత సంతతికి చెందిన కాష్ పటేల్.. గుజరాతీ కుటుంబంలో జన్మించారు.