ట్రాన్స్ జెండర్ల వైద్యచికిత్సలకు మైత్రి క్లినిక్ లు

ట్రాన్స్ జెండర్ల వైద్యచికిత్సలకు మైత్రి క్లినిక్ లు

రాష్ట్రంలోని ట్రాన్స్ జెండర్లకు గౌరవప్రదమైన, సరైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు దేశంలోనే తొలిసారిగా  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైత్రిట్రాన్స్ క్లినిక్లు ఏర్పాటు చేసింది. 33 జిల్లా అసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ఈ క్లినిక్ ను జరిగిన వైద్య ఆరోగ్యశాఖ ప్రజాపాలన విజయోత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించారు. వారంలో రెండు రోజులు (మంగళ, గురువారాలు) ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కేంద్రాలు సేవలు అందిస్తాయి. ఈ క్లినిక్ లో ట్రాన్స్ జెండర్ హెల్త్ కేర్ శిక్షణ పొందిన ప్రత్యేక సిబ్బందిని నియమించారు. వైద్యుడు, కౌన్సెలర్, కమ్యూనిటీ పర్సన్ గా ఒక ట్రాన్స్ జెండర్ ఉంటారు.