PSLV C-59 ప్రయోగం విజయవంతం

PSLV C-59  ప్రయోగం విజయవంతం
  • భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన PSLV C-59 ప్రయోగం విజయవంతమైంది. డిసెంబర్ 5న సాయంత్రం 4.04 గంటలకు చేపట్టారు.
  • తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు.
  • కౌంట్ డౌన్ ముగిసిన వెంటనే యురోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) కి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాన్ని తీసుకుని PSLV C-59 నింగిలోకి దూసుకెళ్లింది.
  • ప్రయోగ సమ యంలో ప్రోబా-3లో రెండు ఉపగ్రహాలూ కలిసే ఉంటాయి. కక్ష్యలోకి చేరాక అవి విడిపోయేలా శాస్త్రవేత్తలు రూపొందించారు.
  • అనుకున్న ప్రకారమే.. 18:40 నిమిషాల వ్యవధిలో నిర్ణీత కక్ష్య లోకి చేరాక ప్రోబా-3లోని రెండు ఉపగ్రహాలూ విడిపోయాయి.
  • ఈ రెండూ ఒక క్రమస్థితిలో పరిభ్రమిస్తూ సూర్యుని బాహ్య వాతావరణమైన కరోనాను అధ్యయనం చేస్తాయి.
  • ఇస్రో అధిపతి : డాక్టర్ సోమనాథ్
  • ఈఎస్ఏ డైరెక్టర్ జనరల్ : జోసఫ్ అషా బాకర్