ద్వితీయ శ్రేణి నగరాల్లో ఇళ్ల ధరలు పెరుగుదల

ద్వితీయ శ్రేణి నగరాల్లో ఇళ్ల ధరలు పెరుగుదల
  • దేశ వ్యాప్తంగా ద్వితీయ శ్రేణి నగరాల్లో ఇళ్ల ధరలు గణనీయంగా పెరిగినట్లు స్థిరాస్తి కన్సల్టింగ్ సేవల సంస్థ ప్రాప్ ఈక్విటీ నివేదికలో వెల్లడించింది.
  • దీని కోసం 30 ద్వితీయ శ్రేణి నగరాల్లోని రియల్ ఎస్టేట్ ధరలను ఈ సంస్థ పరిశీలించింది.
  • ఈ నివేదిక ప్రకారం గత ఏడాది జనవరి నుంచి ఈ ఏడాది అక్టోబరు మధ్య కాలంలో 25 ద్వితీయ శ్రేణి నగరాల్లో ఇళ్ల ధరలు 65 శాతం వరకూ పెరిగాయి.
  • అదే సమయంలో 5 నగరాల్లో ధరలు తగ్గాయి. ఇళ్ల ధరలు బాగా పెరిగిన ద్వితీయ శ్రేణి నగరాల్లో జయపుర (65 శాతం), ఆగ్రా (58 శాతం), గుంటూరు (51 శాతం), మంగళూరు (41 శాతం), చండీగడ్ (34 శాతం) ఉన్నాయి.
  • అదే సమయంలో భోపాల్, మొహాలి, సోనేపట్, త్రివేండ్రమ్, మైసూర్ నగరాల్లో 28 శాతం వరకూ ధరల పతనం కనిపిస్తోంది.
  • గుంటూరు, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో ఇళ్ల ధరలు ఆకర్షణీయంగా పెరిగాయి. ఒక చదరపు అడుగు నిర్మాణ స్థలం సగటు ధర గుంటూరులో రూ.3,429 నుంచి రూ.5.169కి పెరిగింది. ఆదేవిధంగా విశాఖపట్నంలో రూ. 5,821 నుంచి  7,5195కి, విజయవాడలో  రూ.3,932  నుంచి రూ.4,743కు పెరిగినట్లు వివరించింది.
  • ఉత్తర భారతదేశంలోని నగరాలైన జయపుర, ఆగ్రా, చండీగడ్, భివాడి, ఇందౌర్ నగ రాల్లో ఇళ్ల ధరలు 20 శాతం నుంచి 65 శాతం వరకూ పెరిగినట్లు పేర్కొంది