ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ శౌర్య పురస్కారం

ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ శౌర్య పురస్కారం

కెప్టెన్ అవిలాష్ రావత్ 2024 ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ శౌర్య పురస్కారాన్ని అందుకున్నారు. లండన్ లోని ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమం ఇందుకు వేదికైంది. 2024 జనవరి 26న 84,147 టన్నుల నాప్తాను తీసుకెళ్తున్న 'మార్లిన్ లువాండా' నౌకను ఓ బాలిస్టిక్ క్షిపణి తాకడంతో మంటలు చెలరేగాయి. అనంతరం కెప్టెన్ రావత్ తన సిబ్బందితో కలిసి మంటలను అదుపు చేశారు. నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఈ సేవలను గుర్తించిన ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ ఈ అవార్డుతో సత్కరించింది.