డెబిట్ కార్డుల మార్కెట్ వాటాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అగ్రస్థానం
దేశీయంగా డెబిట్ కార్డుల మార్కెట్ వాటాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అగ్రస్థానంలో ఉండగా, క్రెడిట్ కార్డుల్లో ప్రైవేట్‌రంగ దిగ్గజం HDFC బ్యాంక్ అగ్రగామిగా ఉంది. ఎటువంటి హామీ లేని రుణాల మంజూరులో అప్రమత్తంగా ఉండాలన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరికల నేపథ్యంలో, ఏడాది క్రితంతో పోలిస్తే ఈ ఏడాది అక్టోబరులో కొత్త క్రెడిట్ కార్డుల జారీ 45% తగ్గిందని పరిశోధనా నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2023 అక్టోబరులో 16 లక్షల కొత్తక్రెడిట్ కార్డులను జారీ చేయగా, ఈ ఏడాది అదే నెలలో 7.8 లక్షల కొత్త కార్డులనే బ్యాంకులు జారీ చేయడం ఇందుకు నిదర్శనం.
రూపే క్రెడిట్ కార్డుల్లో యూపీఐ లావాదేవీలు రెట్టింపు
రూపే క్రెడిట్ కార్డుల ద్వారా యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్)
లావాదేవీలు గత ఆర్ధిక సంవత్సరం ఇదే సమయంలో పోలిస్తే, ఈ ఏడాది
ఏప్రిల్-అక్టోబరులో దాదాపు రెట్టింపు అయ్యాయి. 2023-24 ఏప్రిల్-అక్టోబరులో
రూ.33,400 కోట్ల విలువైన 36.3 కోట్ల లావాదే వీలు ఈ పద్ధతిలో జరగ్గా,
2024-25 ఇదే కాలంలో రూ.63,800 కోట్ల విలువైన 75 కోట్ల లావాదేవీలు
చోటుచేసుకున్నాయి.