పంజాబ్‌లోని యూనివర్సిటీలకు చాన్స్‌లర్‌గా సీఎం

పంజాబ్‌లోని యూనివర్సిటీలకు చాన్స్‌లర్‌గా సీఎం

పంజాబ్‌లోని యూనివర్సిటీలకు చాన్స్‌లర్‌గా గవర్నర్ల స్థానంలో ముఖ్యమంత్రి ఉంటారు. దీనికి సంబంధించిన బిల్లును ఆ రాష్ట్ర అసెంబ్లీ జూన్‌ 20న ఆమోదించింది. అదేవిధంగా డీజీపీ ఎంపికలో యూపీఎస్సీ పాత్రను తప్పించే బిల్లును ఆమోదించింది. దీని ప్రకారం పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం నియమించే కమిటీ ముగ్గురు ఐపీఎస్‌లను ఈ పోస్టు కోసం ప్రతిపాదిస్తుంది. వీరి నుంచి ప్రభుత్వం ఒకరిని ఎంపిక చేస్తుంది. అలాగే అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో పఠించే గుర్బానీ ప్రసార హక్కులు ఉచితంగా అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు సిక్కు గురుద్వారా చట్టం-1925కు సవరణ బిల్లును కూడా ఆమోదించింది.