లింగ సమానత్వ సూచీ భారత్‌ 127వ స్థానం

లింగ సమానత్వ సూచీ భారత్‌ 127వ స్థానం

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం 2023కు జూ 21న విడుదల చేసిన 146 దేశాల లింగ సమానత్వ సూచీలో భారత్‌ 127వ స్థానంలో నిలిచింది. దీనిలో ఐస్‌లాండ్‌ మొదటి స్థానంలో ఉండగా.. నార్వే 2, ఫిన్‌లాండ్‌ 3, న్యూజిలాండ్‌ 4, స్వీడన్‌ 5వ స్థానాల్లో ఉన్నాయి. ఐస్‌లాండ్‌ ఈ సూచీలో వరుసగా 14 ఏండ్ల నుంచి అగ్రస్థానంలో నిలుస్తుంది. బంగ్లాదేశ్‌ 59, భూటాన్‌ 103, చైనా 107, శ్రీలంక 115, నేపాల్‌ 116, పాకిస్థాన్‌ 142వ స్థానాల్లో నిలిచాయి.