విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDIలు) కు అత్యంత ఆకర్షణీయ గమ్యస్థానంగా మనదేశం నిలుస్తోంది. 2000 ఏప్రిల్ 2024 సెప్టెంబరు మధ్య మనదేశంలోకి వచ్చిన FDI లక్ష కోట్ల డాలర్ల (రూ.84 లక్షల కోట్లకు పైగా) మైలురాయిని అధిగమించినట్లు పరిశ్ర మలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (DPIIT) వెల్లడించింది. ప్రపంచంలో పెట్టు బడులకు భద్రమైన, కీలకమైన దేశంగా భారత్ అవతరించడాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తు న్నాయి. DPIIT గణాంకాల ప్రకారం.. గత నాలుగున్నరేళ్లలో ఈక్విటీ, లాభాలను మళ్లీ పెట్టుబడులుగా పెట్టడం, ఇతర మూలధనం సహా మొత్తం FDI 1,033,40 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
• మొత్తం FDIల్లో 25% మారిషస్ మార్గంలో వచ్చాయి. సింగపూర్ (24%), అమెరికా (10%), నెదర్లాండ్స్ (7%), జపాన్ (6% ), బ్రిటన్ (5%), యూఏఈ (3%), కేమన్ ఐలాండ్స్ (2%), జర్మని (2%), సైప్రస్ (2%) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
మారిషస్ నుంచి 177. 18 బిలియన్ డాలర్లు, సింగపూర్ నుంచి 167.47 బిలియన్ డాలర్లు, అమెరికా నుంచి 67.8 బిలియన్ డాలర్ల చొప్పున మన దేశంలోకి పెట్టుబడులు వచ్చాయి.
FDIలను ఎక్కువగా ఆకట్టుకున్న రంగాల్లో సేవలు, కంప్యూటర్ సాఫ్ట్ వేర్, హార్డ్వేర్, టెలికమ్యూనికేషన్స్, ట్రేడింగ్, నిర్మాణరంగం, ఆటో మొబైల్, రసాయనాలు, ఔషదాలు ఉన్నాయి.
వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకారం.. 2014-24 మధ్య భారత్ లోకి 667.4 బిలి యన్ డాలర్ల FDIలు వచ్చాయి. 2004-14లో వచ్చిన మొత్తంతో పోలిస్తే ఇది 119% ఎక్కువ, 2004-14 మధ్య తయారీ రంగంలోకి 97.7 బి. డాలర్లు రాగా, 2014-24 మధ్య 69% వృద్ధితో ఈ మొత్తం 165.1 బి.డాలర్లకు చేరింది.