నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ తుశిల్

నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ తుశిల్

అధునాతన గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ తుశిల్ భారత నౌకాద శంలో లాంచనంగా చేరింది. రష్యాలోని కలినిన్ గ్రాడ్ నగరంలో జరిగిన ఈ కార్యక్రమానికి భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి హాజరయ్యారు. అధునాతన సాధన సంపత్తి కలిగిన ఈ యుద్ధనౌక చేరికతో హిందూ మహాస ముద్రంలో నేవీ పోరాట సామర్థ్యం మరింత ఇనుమడిస్తుంది. ఈ ప్రాంతంలో చైనా కదలికలు గత కొన్నేళ్లుగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. INS తుశిల్ ను రష్యాలో నిర్మించారు. భారత నౌకా దళం కోసం నాలుగు స్టెల్త్ ప్రిగేట్ యుద్ధనౌకల నిర్మాణానికి 2016లో రెండు దేశాల మధ్య కుదిరిన 250 కోట్ల డాలర్ల ఒప్పందం మేరకు దీని నిర్మాణం జరిగింది. దీని ప్రకారం రెండు యుద్ధనౌకలను రష్యాలో, మిగతావాటిని భారత్ లో నిర్మించాలి. INS తుశిల్ బరువు 3,900 టన్నులు. పొడవు 125 మీటర్లు. ఇందులో భారత పరిజ్ఞానం వాటా 26 శాతం మేర ఉంది. ఈ యుద్ధనౌకలో శక్తిమం తమైన ఆయుధాలు ఉంటాయి.