IAMC శాశ్వత ట్రస్టీగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి

IAMC శాశ్వత ట్రస్టీగా జస్టిస్ సుదర్శన్  రెడ్డి
  • దేశానికే తలమానికంగా హైదరాబాద్ లో ఏర్పాటైన అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (IAMC) శాశ్వత ట్రస్టీగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్  రెడ్డి బాధ్యతలు చేపట్టారు.
  • జస్టిస్ లావు నాగేశ్వరరావు శాశ్వత ట్రస్టీ పదవికి వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయడంతో ఆ స్థానాన్ని ఈయన చేపట్టారు.
  • 2018లో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్. వి.రమణ రూపకర్తగా అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటైన IAMCలో శాశ్వత ట్రస్టీలుగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.వి.రవీంద్రన్, జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ హిమా కోహ్లిలు బాధ్యతలు చేషట్టారు.
  • ప్రస్తుతం స్థానికంగా ఉన్న జస్టిస్ సుదర్శన్  రెడ్డి ట్రస్టీగా బాధ్యతలు స్వీకరించడంతో IAMC సామాన్యులకూ అందుబాటులోకి తీసుకొస్తారని న్యాయ ప్రముఖులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
  • 1946లో జన్మించిన జస్టిస్ సుదర్శన్  రెడ్డి న్యాయవాదిగా 1971లో న్యాయవాద వృత్తిని ప్రారంబించారు. 1995 లో ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తరువాత 2005లో గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2007 జనవరిలో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పని చేసి 2011 జులైలో పదవీ విరమణ చేశారు.