రాజ్యసభ సభ్యురాలిగా రేఖా శర్మ ఏకగ్రీవ ఎన్నిక

రాజ్యసభ సభ్యురాలిగా రేఖా శర్మ ఏకగ్రీవ ఎన్నిక

రాజ్యసభ ఉప ఎన్నికల్లో జాతీయ మహిళా కమిషన్ మాజీ అధ్యక్షురాలు, భాజపా నాయకురాలు రేఖా శర్మ హరియాణా నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం 3 గంటలతో నామినేషన్ ల ఉపసంహరణకు గడువు ముగియగా బరిలో ఆమె ఒక్కరే నిలిచారు. దీంతో ఆమె ఎన్నిక లాంఛనమైంది. భాజపాకు చెందిన క్రిషన్ లాల్ పన్వర్ శాసనసభ ఎన్నికల్లో గెలవడంతో తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఖాళీ అయిన ఆ స్థానానికి తాజాగా రేఖా శర్మ ఎన్నికయ్యారు.