మూతపడిన 300 ఏండ్ల దినపత్రిక

మూతపడిన 300 ఏండ్ల దినపత్రిక
ప్రపంచంలోనే అత్యంత పురాతన దినపత్రికలలో ఒకటైన ‘వీనర్‌ జీతంగ్‌’ దినపత్రిక మూతపడింది. మూడు శతాబ్దాలకు పైగా పాఠకులకు సేవలందించిన ఈ ఆస్ట్రియా ప్రాచీన దినపత్రిక ‘పాఠకులారా ఇక సెలవ్‌’ అంటూ తన ఆఖరి ఎడిషన్‌తో వీడ్కోలు పలికింది. వియన్నా కేంద్రంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచినప్పటికీ స్వతంత్రంగా వ్యవహరించిన ఈ పత్రిక ఆగస్టు 8, 1703లో ప్రారంభమైంది. ఇటీవల పత్రిక ఆదాయం తగ్గడం, ప్రింటింగ్‌ ఖర్చు భారంగా మారడంతో పత్రికను మూసివేయాలని నిర్ణయించారు.