రామోజీ ఫిల్మ్‌సిటీ'కి ఎఫ్‌టీసీసీఐ ఎక్స్‌లెన్స్ టూరిజం అవార్డు
పర్యాటక స్వర్గధామం రామోజీ ఫిల్మ్ సిటీకి... మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. పర్యాటకరంగంలో రామోజీ ఫిల్మ్ సిటీ చేస్తున్న విశేష కృషికిగానూ... ఎఫ్‌టీసీసీఐ ఎక్స్‌లెన్స్ టూరిజం అవార్డు ప్రదానం చేసింది. హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో.... తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా.. ఫిల్మ్‌సిటీ ఎండీ సీ.హెచ్.విజయేశ్వరి అవార్డు అందుకున్నారు. ఎక్స్‌లెన్స్ టూరిజం అవార్డు కోసం... ఎఫ్‌టీసీసీఐకి 22 రంగాలలో 150 దరఖాస్తులు రాగా... అందులో రామోజీ ఫిల్మ్‌సిటీకి అవార్డు లభించింది.