జీసీఎల్‌ ఛాంప్‌ త్రివేణి కింగ్స్‌

జీసీఎల్‌ ఛాంప్‌ త్రివేణి కింగ్స్‌

అప్‌గ్రాడ్‌ ముంబా మాస్టర్స్‌-త్రివేణి కాంటినెంటల్‌ కింగ్స్‌ మధ్య జరిగిన అంతిమ సమరం చెస్‌ అభిమానులను తీవ్ర ఉత్కంఠకు లోను చేసింది. అయితే అంతిమంగా త్రివేణి కాంటినెంటల్‌ కింగ్స్‌ ఆధిక్యం ప్రదర్శించి చాంపియన్‌గా అవిర్భవించింది. దీంతో తెలుగు గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారికలతో కూడిన ముంబా మాస్టర్స్‌ జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. రెండు మ్యాచ్‌ల ఫైనల్‌.. తొలి పోరులో త్రివేణి 8-7తో మాస్టర్స్‌పై నెగ్గింది. రెండో మ్యాచ్‌లో పుంజుకున్న ముంబా మాస్టర్స్‌ 12-3తో త్రివేణిని చిత్తు చేసి సమంగా నిలిచింది. దాంతో అనివార్యమైన బ్లిట్జ్‌ పోరులోనూ రెండు జట్లు సమంగా నిలిచాయి. ఫలితం ప్లేఆఫ్‌కు దారితీయగా.. అందులోనూ మూడు గేమ్‌లు డ్రాగా ముగిశాయి. అయితే, నాలుగో గేమ్‌లో త్రివేణి ఆటగాడు జొనాస్‌, ప్రత్యర్థి సిందరోవ్‌ను ఓడించి తన జట్టును ‘కింగ్స్‌’గా నిలిపాడు. విజేత త్రివేణికి రూ.4.10 కోట్లు రన్నరప్‌ ముంబాకు రూ. 2.05 కోట్ల ప్రైజ్‌మనీ లభించింది.