ప్రారంభానికి సిద్ధమైన తొలి హైడ్రోజన్ రైలు

ప్రారంభానికి సిద్ధమైన తొలి హైడ్రోజన్ రైలు

దేశ ప్రజలకు స్థిరమైన రవాణా కల్పించే దిశగా భారతీయ రైల్వే మరో అడుగు ముందుకు వేసింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా హైడ్రోజన్ శక్తితో నడిచే రైలును ప్రారంభానికి సిద్ధం చేసింది. ఈ హైడ్రోజన్ రైళ్లు ఆక్సిజన్, హైడ్రోజన్ ను విద్యుత్ గా మార్చి, సాంప్రదాయ డీజిలో రైళ్లకు పర్యావరణ హితమైన ప్రత్యామ్నయాన్ని అందిస్తాయి. ఈ సంచలనాత్మక నిర్ణయం కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి, కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి దేశం చేస్తున్న ప్రయత్నాలలో ఆశాజనకమైన పురోగతిని అందిస్తుంది. తొలిసారిగా హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలు హర్యానాలోని జింద్-సోనిపట్ మార్గంలో నడపనున్నారు.