అరుదైన ఆక్సిజన్‌ ఐసోటోప్‌ ఆవిష్కరణ

అరుదైన ఆక్సిజన్‌ ఐసోటోప్‌ ఆవిష్కరణ

శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా ఆక్సిజన్‌-28 ఐసోటోప్‌ను గుర్తించారు. ఈ పరమాణు కేంద్రంలో అనూహ్యంగా 12 అదనపు నూట్రాన్లు ఉండటం.. భౌతికశాస్త్ర అధ్యయనంలో విప్లవాత్మకమైందిగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
టోక్యో, శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా ఆక్సిజన్‌-28 ఐసోటోప్‌ను గుర్తించారు. ఈ పరమాణు కేంద్రంలో అనూహ్యంగా 12 అదనపు నూట్రాన్లు ఉండటం.. భౌతికశాస్త్ర అధ్యయనంలో విప్లవాత్మకమైందిగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. జపాన్‌లోని రేడియో యాక్టివిటీ ఐసోటోప్‌ బీమ్‌ ఫ్యాక్టరీలో అంతర్జాతీయ పరిశోధకుల బృందం ఆక్సిజన్‌-28 ఐసోటోప్‌ను విజయవంతంగా ఆవిష్కరించారని ప్రఖ్యాత సైన్స్‌ జర్నల్‌ ‘నేచర్‌ టుడే’ వార్తా కథనం ప్రచురించింది. శాస్త్రవేత్తలు క్యాల్షియం-48 పుంజాన్ని కాల్చి.. ఇది ఫ్లోరిన్‌-29 ఐసోటోప్‌ను సృష్టించారు. అనంతరం ఫ్లోరిన్‌-29 హైడ్రోజన్‌ను పగలగొట్టగా.. న్యూట్రాన్లు, ప్రొటాన్లు వేరు చేశారు. దీంతో ఆక్సిజన్‌-28 ఉత్పత్తి చేశారు.