డాక్టర్‌ శాంతా తౌటంకు ఇన్నోవేషన్‌ అవార్డు

డాక్టర్‌ శాంతా తౌటంకు ఇన్నోవేషన్‌ అవార్డు

రాష్ట్ర చీ ఫ్‌ ఇన్నోవేషన్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శాంతా తౌటంను వరల్డ్‌ ఇన్నోవేషన్‌ అవార్డు వరించింది. మాస్కోలో ఆగస్టు 27 నుంచి 29 వరకు జరిగిన మొదటి బ్రిక్స్‌ ఇన్నోవేషన్‌ ఫోరం సదస్సులో ఆమెకు అవార్డు అందించారు. డాక్టర్‌ శాంత టీ హబ్‌ ఉపాధ్యక్షురాలిగా కెరీర్‌ను ప్రారంభించి, ఎకో సిస్టంలో ఏడేండ్లుగా సేవలందించడంతో పాటు రాష్ట్ర చేనేత జౌళిశాఖ ఓఎస్డీగా పనిచేశారు.