జీఎస్టీ వసూళ్లు 1.59 లక్షల కోట్లు

జీఎస్టీ వసూళ్లు 1.59 లక్షల కోట్లు

ఆగష్టు నెలకుగాను రూ.1.59 లక్షల కోట్ల జీఎస్టీ వసూలయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెలలో వసూలైన రూ.1.43 లక్షల కోట్ల కంటే ఇది 11 శాతం అధికమని ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఆగస్టు నెలలో వసూలైన రూ.1,59,069 కోట్లలో సెంట్రల్‌ జీఎస్టీ కింద రూ.28,328 కోట్లు, స్టేట్‌ జీఎస్టీ కింద రూ.35,794 కోట్లు, ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ కింద రూ.83,251 కోట్లు, సెస్‌ల రూపంలో రూ.11,695 కోట్లు వసూలయ్యాయి.   
తెలంగాణ రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు క్రమంగా పెరుగుతున్నాయి. గత కొన్ని నెలలుగా పెరుగుతూ వచ్చిన జీఎస్టీ వసూళ్లు ఆగస్టులోనూ రూ.4,393 కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే నెలలో వసూలైన రూ.3,871 కోట్ల కంటే ఇది 13 శాతం అధికమని పేర్కొంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో 10 శాతం పెరిగి రూ.3,173 కోట్ల నుంచి రూ.3,479 కోట్లకు చేరుకున్నాయి.