ఇస్రో శాస్త్రవేత్త ఎన్ వలర్మతి కన్నుమూత
ఇస్రో ప్రయోగాల్లో 3.. 2.. 1.. అంటూ కౌంట్‌డౌన్ వినిపించే వలర్మతి కన్నుమూశారు. గుండెపోటు రావడంతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ మరణించారు. తమిళనాడులోని అరియలూర్‌లో 1959లో జన్మించిన వాలర్మతి కోయంబత్తూరులో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఆమె చివరిగా చంద్రయాన్-3 మిషన్‌కు సేవలు అందించారు. ఇస్రో మాజీ డైరెక్టర్ పీవీ వెంకిటకృష్ణన్ ఆమె సేవలను కొనియాడారు.