టీఎస్‌కాబ్‌కు ఉత్తమ ప్రతిభా అవార్డు

టీఎస్‌కాబ్‌కు ఉత్తమ ప్రతిభా అవార్డు
తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంక్‌ (టీఎస్‌కాబ్‌)కు 2020-21కిగాను అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు రాష్ట్ర సహకార బ్యాంకుల జాతీయ సమాఖ్య (నాఫ్స్‌కాబ్‌) ప్రథమ బహుమతిని ప్రకటించింది. అలాగే 2021-22కుగాను ద్వితీయ బహుమతి వచ్చిందని ఓ ప్రకటనలో టీఎస్‌కాబ్‌ తెలిపింది. సహకార శిక్షణ సంస్థల విభాగంలో టీఎస్‌కాబ్‌-సీటీఐకి 2020-21, 2021-22కు ప్రథమ బహుమతులు వచ్చాయి. కరీంనగర్‌ జిల్లా సహకార బ్యాంక్‌కు, చొప్పదండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి కూడా ఉత్తమ పురస్కారాలు దక్కాయి.